అన్నదాతకు అండగా రైతు భరోసా కేంద్రాలు

    ఇదివరకు మండల కేంద్రాల వద్ద కేంద్రీకృతమైన వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యకలాపాలు.. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో గ్రామాలకు, రైతులకు చేరువయ్యాయి. వ్యవసాయంలో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహాలు.. ఇలా ఎన్నో సేవల కోసం కాళ్ళరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో పాటు యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచడంతో రైతులు లబ్ధి పొందుతున్నారు. అధికారులు ఉత్పాదకాలను ముందుగానే పరీక్షలు జరిపి, నాణ్యత నిర్ధారించాకే రైతులకు అందజేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దృష్టి సారించి.. రైతు భరోసా కేంద్రాలను అన్నిరకాలుగా అన్నదాతకు ఉపయుక్తంగా మార్చటానికి వ్యవసాయ శాఖ ప్రయత్నిస్తోంది. ఆగ్రోస్, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, ఇతర అనుబంధ శాఖల భాగస్వామ్యంతో కసరత్తు జరుపుతోంది. రైతులకు సేవలందించే ఈ ఆర్బీకేల పనితీరుపై కథనం.