అమ్మఒడి పథకంతో ప్రతి ఇంటా ఆనందాలే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న  అమ్మ ఒడి పథకం విద్యారంగంలో నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. విద్యార్థుల డ్రాప్ అవుట్ లు తగ్గించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు, కళాశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకు ప్రభుత్వం ప్రతి ఏటా 15 వేల రూపాలయులను జమ చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికి  ఈ పథకాన్ని వర్తింపజేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కాకుండా ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారందరికీ కూడ లబ్ది చేకూర్చారు. మొత్తం 82 లక్షల మంది విద్యార్థులకు, 42 లక్షల 33 వేల 098 మంది తల్లుల ఖాతాలకు ప్రభుత్వం నగదు బదిలి చేసింది. అమ్మ ఒడి పథకం ప్రారంభం కావడంతో  ఏపీలోని ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు .

తమ పిల్లలను చదివించేందుకు ప్రతి ఏటా వేల రూపాయలు ప్రైవేటు పాఠశాలలకు చెల్లించాల్సి వచ్చేదని సంధ్య తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే తిరిగి మాకు మా ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేయటం సంతోషంగా ఉందని.. అలా ఏడాదికి 15 వేల చొప్పున తమ ఇద్దరి పిల్లలకు 30 వేల రూపాయలు లభ్ధిపొందటంపై మరింత ఆనందంగా వున్నారు.

-సంధ్య, గృహిణి

మేం చదువుకునే రోజుల్లో బడికి వెళ్ళాలంటే డబ్బులకు చాల కష్టంగా వుండేది. కానీ ఇప్పుడు పేదవిద్యార్థులకు అలాంటి సమస్య రాకుండా తమ పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా తమ బ్యాంక్ అకౌంట్ లోకి ప్రభుత్వం జమ చేస్తుందని బాల వెంకట్ రెడ్డి అంటున్నారు. గతంలో మేము దగ్గరలో ఉన్న మరో ప్రాంతంలో ప్రయివేటు పాఠశాలకు మా పిల్లలకు వేలకు వేలు ఫీజులు చెల్లించి బస్సులో పంపించే వారమని.. అలాంటిది ఇప్పుడు మా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పిల్లలను చదివిస్తూ సంతోషంగా వున్నామని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

-బాల వెంకట రెడ్డి,రైతు