అర్హులైన లభ్ధిదారులకు పక్కా ఇంటి నిర్మాణాలు

    రాష్ట్రంలో అర్హులైన ప్రతి లభ్దిదారుడికి మాట తప్పకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి అధికారులతో సమీక్ష ​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్‌ జగనన్న కాలనీలను .. మోడల్‌ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

    ఈపథకంలో అర్హులై ఉండి ఇప్పటి వరకు.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీలకు సంబంధం లేకండా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీరంగనాథ రాజు తెలిపారు.