పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి బొత్స
ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆగస్టు 15 నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయనగరం మునిసిపల్ కార్యాలయంలో రూ.1.48 కోట్లతో నిర్మించిన రెండు, మూడు అంతస్తులను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ క్లాప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా వాటి పరిధిలోని ప్రతి ఇంటికీ మూడేసి చొప్పున డస్ట్ బిన్లను పంపిణీ చేస్తామని వివరించారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించడానికి వీలుగా అదనంగా 5 వేల కొత్త వాహనాలను సమకూరుస్తామని చెప్పారు. అవినీతికి చెక్ పెట్టేందుకే కొత్త పన్ను విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
Source: https://www.sakshi.com/telugu-news/politics/clean-andhra-pradesh-august-15-1376528