ఆస్తి పన్నుపై నూతన విధానం

    మంత్రి బొత్స సత్యనారాయణ

    అవినీతికి తావు లేకుండా ఆస్తి పన్నుపై నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా, ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు నిర్ణయించాలని ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకున్న నూతన పన్ను విధానంతో ఆదాయం రూ.186 కోట్లు వచ్చింది.

     లోపాలను సరిచేస్తూ నూతన విధానం
    ► వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్‌ రూ.1,242 కోట్లు ఉంటే.. అది ఇప్పుడు రూ.1,428 కోట్లకు పెరిగింది. అంటే వ్యత్యాసం రూ.186 కోట్లే. గతంలో మూడు నెలల అద్దె ప్రామాణికంగా పన్ను వేసేవారు. ఇది లోపభూయిష్టంగా ఉండటంతో నూతన పన్ను విధానం తీసుకువచ్చాం.
    ► నివాస భవనాలకు ఆస్తి విలువలో 0.10 నుంచి 0.50 శాతం, నివాసేతర వాణిజ్య భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను ఉండాలని నిర్ణయించాం. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సరే గరిష్టంగా 15 శాతానికి మించి ఒక్కపైసా కూడా పన్ను పెరిగే పరిస్థితి లేదు. అదే 375 చదరపు అడుగుల లోపల నివాస గృహాల్లో ఉండే పేదలకు ఏడాదికి పన్ను కేవలం రూ.50 మాత్రమే.
    ► శాసనసభలో మూడు రాజధానులకు సంబంధించిన చట్టం చేసినప్పటి నుంచే పరిపాలన వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఏ క్షణంలో అయినా విశాఖ నుంచి పరిపాలన సాగే అవకాశం ఉంది. అడ్డంకులను తొలగించుకుంటూ విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్, అమరావతిని లెజిస్లేటివ్‌ రాజధానులుగా చేయాలన్నదే ప్రభుత్వ విధానం.
    ► కోవిడ్‌ నేపథ్యంలో ఈ ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా ఈ రెండేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేసింది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచుతున్నాం.

    Source: https://www.sakshi.com/telugu-news/politics/botsa-satyanarayana-fires-chandrababu-1370336