ఇంజనీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ​ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌​, ఫీజుల చెల్లింపుకు అవకాశం ఉంది.  26 నుంచి 31 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించనున్నారు. 

నవంబర్‌ 1నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్లు అవకాశం కల్పించారు. వెబ్‌ ఆప్షన్ల మార్పులకు నవంబర్‌ 6 వరకు అవకాశం ఉంది. నవంబర్‌ 10న ఇంజనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయించగా.. నవంబర్‌ 10 నుంచి నవంబర్‌15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఇక నవంబర్‌ 15 నుంచి ఇంజనీరింగ్‌, ఫార్మసీ తరగతులు ప్రారంభం కానునున్నాయి.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/apengineering-and-pharmacy-admission-notification-released-1405721