ఇచ్చట సీజన్ లేకుండా ఏడాదంతా పండ్లు కాస్తుంటాయి

    ఇది పాత పద్దతులతో చేస్తున్న కొత్త రకం వ్యవసాయం. మామిడి, పనస వంటి సీజనల్ పళ్లు కూడా ఇక్కడ ఏడాది పొడవునా కాస్తుంటాయి. కొన్ని పళ్ల చెట్లు నాటిన ఏడాదికే కాపుకొచ్చేస్తాయి. ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయం అమేయ కృషి విజ్ఞాన కేంద్రం. ఆగ్రో హోమియోపతితో తెగుళ్లు నివారించడంతో పాటు, తన వ్యవసాయ జ్ఞానాన్ని రైతులకు ఉచితంగా అందించనున్న ఆదర్శ రైతు.