ఇలాంటి భూములకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు

    గోడౌన్ల నిర్మాణం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు లీజుకిస్తున్న భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం మినహాయించింది. ఈ సొసైటీలను గ్రామ స్థాయిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు వాటి పరిధిలో గోడౌన్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తోంది. ఈ భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-govt-has-exempted-stamp-duty-lands-leased-construction-godowns-1385426