ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు

    ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. జగనన్న కాలనీలకు ఇసుకను నేరుగా రీచ్‌ల నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ-పర్మిట్‌ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగా నిల్వలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 50 లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం  రోజుకి 3 లక్షల టన్నుల ఇసుక తీస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/minister-peddireddy-said-measures-without-difficulty-sand-supply-1371116