ఈనెల 14న సీఎం జగన్‌ పోలవరం సందర్శన

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలవరం పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు.అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

    ఈ నెల 14వ తేదీన సీఎం జగన్‌ పోలవరం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్​ కార్తికేయ మిశ్రా.. ఏర్పాట్లపై పోలవరం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-will-visit-polavaram-project-14th-1377746