ఏపీఎస్ఆర్టీసీలో నియామకాలు

    ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావారికి ఆ సంస్థ ఎండీ ద్వారాకా తిరుమల రావు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్టీసీపై పెను ప్రభావం పడింది. బస్సు సర్వీసులు లేక ఆర్టీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి తేరుకుంటోంది. దీంతో రెగ్యులర్ అంశాలు.. పెండింగ్ లో ఉన్న ఇష్యూలపై అధికారులు ఫోకస్ చేశారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న.. ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన వారి పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ముందు చెప్పిన హామీలో భాగంగా తిరుపతిలో మొదటి విడతగా 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన నడపనున్నామని చెప్పిన ఆయన, తిరుపతిలో విజయవంతమైతే విశాఖ, కాకినాడ, గుంటూరులో కూడా ఈ తరహా బస్సులు ప్రవేశ పెడతామన్నారు ఎండీ.

    ఏపీఎస్ఆర్టీసీలో చాలా ఏళ్లుగా ఈ కారుణ్య నియమాకాలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900లకు పైగా నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. కారుణ్య నియామకపంతో పాటు పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. గత నెలల కూడా మంత్రి పేర్ని నాని బాధిత కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇటీవల కర్నూలు, తూర్పుగోదావరి, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పారు. తమవారు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మరణం చెందారని మంత్రికి వివరించారు. కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు..

    రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా కరోనా కారణంగా ఆర్టీసీ ఇబ్బందుల్లో పడింది. బస్సులు తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందని అప్పట్లో మంత్రి స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్​పై తుది నిర్ణయానికి ఐఏఎస్ అధికారులు వారం కిందటే ఏకాభిప్రాయానికి వచ్చారని చెప్పారు. తాజాగా దీనిపై ఎండీ ద్వారా తిరుమల రావు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కారుణ్య నియమాకాలు చేపడుతున్నట్టు చెప్పారు.

    Source: https://telugu.news18.com/news/jobs/good-news-compassionate-appointments-coming-soon-rtc-md-dwaraka-tirumala-rao-says-ngs-953936.html