ఏపీ సీడ్స్‌కు జాతీయ అవార్డు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సామజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సర్టిఫైడ్‌ విత్తనాలను ఖరీఫ్‌ సీజన్‌కు ముందే పంపిణీ చేసి.. రైతుల ఆదరణను ప్రభుత్వం చూరగొందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఖర్చుల భారం లేకుండా ఊళ్లోనే విత్తనాలు అందాయని చెప్పారు.

    విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకురిందన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర సిబ్బందిని మంత్రి కన్నబాబు అభినందించారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/national-award-ap-seeds-under-social-responsibility-1383177