కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15 వేల ప్రకటన

    కరోనా కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు చికిత్స చేయించలేక కొందరు.. కోవిడ్ కారణంగా చనిపోయిన తమ కుటుంబసభ్యులకు సరైన రీతిలో అంత్యక్రియలు కూడా చేయలేని దయనీయస్థితిలో చాల మంది ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల అంత్యక్రియలకు 2021-22 ఏడాదికి వర్తించేలా ప్రభుత్వం రూ.15వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఆర్థికసాయంపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలు అప్పగించారు.