కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ

    కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా కరోనా చికిత్సను ప్రభుత్వం కల్సిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  గత ఏడాది కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ తో సుమారు  లక్షా 11వేల 266 మందికి కరోనా చికిత్సను ఉచితంగా అందించారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు ఇప్పటివరకు రూ.332 కోట్ల 41 లక్షలు పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆంధ్రపదేశ్‌  ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యం అందిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం పట్ల ఇతర రాష్ట్రాల్లోనూ ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

    దక్షిణాదిలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు: కేంద్రం
    దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశం మొత్తంలో 36 లక్షలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్రం స్ఫష్టం చేసింది. రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్‌ సమస్యను ఈనెలాఖరులోగా పరిష్కరిస్తామని తెలిపింది.రాష్ట్రాల్లో 70:30 నిష్పత్తిలో సెకండ్‌, తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియగా కొనసాగాలని కేంద్రం రాష్ట్రాలకు విన్నవించింది.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/aarogyasri-scheme-sanjeevani-corona-patients-1362207