కోవిడ్‌ కష్టాల్లోనూ కొనసాగిన 2021 సంక్షేమ పథకాలు

  • సంక్షోభంలోనూ సంక్షేమం.. 2021లో సంక్షేమ పథకాలు ఇలా..
  • వివిధ పథకాలతో ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • రూ.99,535.88 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం
  • ఆదాయం క్షీణించినా మాటకు కట్టుబడ్డ సీఎం జగన్‌  

కోవిడ్‌తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది.

ఏడాదిలో దాదాపు రూ.లక్ష కోట్లు 
2021లో వివిధ వర్గాల కోసం సీఎం జగన్‌ ఏకంగా రూ.99,535.88 కోట్ల కార్యక్రమాల అమలు ప్రారంభించారు. ఒక్క పెన్షన్ల కోసమే రూ.17,400 కోట్లు వ్యయం చేయగా వివిధ పథకాల ద్వారా మరో రూ.33,301.88 కోట్లను ప్రజల ఖాతాలకు జమ చేశారు. ఇవి కాకుండా పేదల కోసం తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.28,084 కోట్లతో చేపట్టారు. ఇంటిపై రుణం తీసుకుని ఎలాంటి హక్కులు లేని పేదలకు సర్వహక్కులు కలి్పంచేందుకు ఓటీఎస్‌ పథకాన్ని తెచ్చి రూ.16,000 కోట్లు లబ్ధి చేకూరుస్తున్నారు. పేద కుటుంబాల ఉచిత బీమాకు రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించగా పాడిని నమ్ముకున్న అక్క చెల్లెమ్మల కోసం రూ.4,000 కోట్లతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు, ఆటోమెటిక్‌ పాల సేకరణ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. 

జనవరి 11, 2021: జగనన్న అమ్మ ఒడి
వరుసగా రెండో ఏడాది చెల్లింపులు చేశారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలిగేలా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేశారు.

మార్చి  31, 2021: వైఎస్సార్‌ బీమా పరిహారం చెల్లింపు 
అర్హులైనప్పటికీ బ్యాంక్‌లో ఎన్‌రోల్‌ కాకుండా మిగిలిపోయి దురదృష్టవశాత్తూ మరణించిన 12,039 మంది పేదకుటుంబాలకు వైఎస్సార్‌ బీమా కింద రూ. 254 కోట్లు పరిహారంగా జమచేశారు.

ఏప్రిల్‌ 16, 2021: అమూల్‌ పాలవెల్లువ విస్తరణ  
ఏపీ–అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలలో 400 గ్రామాల్లో అమూల్‌ సంస్థ పాలు సేకరిస్తుండగా కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణను సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

ఏప్రిల్‌ 19, 2021: ఠంచన్‌గా జగనన్న విద్యాదీవెన 
2020–21 విద్యా సంవత్సరంలో తొలి విడత (త్రైమాసికం)గా 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.671.45 కోట్లు జమ.

ఏప్రిల్‌ 23, 2021: అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ 
బ్యాంకు రుణాలు తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన 9.34 లక్షల సంఘాలకు చెందిన కోటి మందికి పైగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి. వారు తీసుకున్న రుణాలపై ఏడాది వడ్డీ రూ.1,109 కోట్లను చెల్లించిన ప్రభుత్వం.

ఏప్రిల్‌ 28, 2021: జగనన్న వసతి దీవెన రెండో ఏడాది చెల్లింపులు  
2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల వసతి, భోజనం ఖర్చులకు గానూ వసతి దీవెన పథకంలో 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.1049 కోట్లు జమ. 

మే 13 2021: వైఎస్సార్‌ రైతు భరోసా  
రైతులకు పెట్టుబడి సాయంగా వరుసగా మూడో ఏడాది తొలి విడతగా 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.3,928.88 కోట్లు జమ. 

మే 18, 2021: మత్స్యకార భరోసా 
ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేటపై నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే విధంగా మత్స్యకార భరోసా పథకం అమలు.  ఈ ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.119.88 కోట్లు చెల్లింపు.

మే 25 2021: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా  
కరోనా కష్ట కాలంలోనూ రైతులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం. 2020 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.1,820.23 కోట్ల బీమా పరిహారం చెల్లింపు.

జూన్‌  3, 2021: వైఎస్సార్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం ప్రారంభం  
నవరత్నాలు–పేదలందరికీ  ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పీఎంఏవైతో అనుసంధానం ద్వారా తొలి విడతగా రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం.

జూన్‌ 4, 2021: అమూల్‌ పాలవెల్లువ విస్తరణ  
రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో 722 గ్రామాల్లో పాలసేకరణ చేపట్టిన అమూల్‌ సంస్థ కొత్తగా పశి్చమ గోదావరి జిల్లాలో కూడా సేకరణ ప్రారంభించింది. జిల్లాలో 153 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. 

జూన్‌ 8, 2021: జగనన్న తోడు రెండో విడత చెల్లింపులు  
చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల రుణాన్ని ఇప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది 3.70 లక్షల మంది ఖాతాల్లో రూ.370 కోట్లు జమ చేసింది. 

జూన్‌ 15, 2021: వైఎస్సార్‌ వాహనమిత్ర  
ఈ పథకంలో వరుసగా మూడో ఏడాది 2,48,468 మంది లబి్ధదారులకు రూ.10 వేల చొప్పున రూ.248.47 కోట్ల ఆరి్థక సహాయాన్ని ప్రభుత్వం అందచేసింది. 

జూన్‌ 22, 2021: వైఎస్సార్‌ చేయూత  
వరుసగా రెండో ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 23.14 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4,339.39 కోట్ల ఆరి్థక సాయాన్ని పథకం ద్వారా ప్రభుత్వం అందించింది.

జూలై 1, 2021: వైఎస్సార్‌ బీమా
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 1.32 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ. పూర్తి ప్రీమియం రూ.750కోట్లను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.

జూలై 22, 2021: వైఎస్సార్‌ కాపు నేస్తం  
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్క చెల్లెమ్మల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం అమలు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా కులాలకు చెందిన 3,27,244 మంది మహిళలకు రూ.490.86 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ.

జూలై 29, 2021: జగనన్న విద్యాదీవెన 
విద్యా సంవత్సరంలో రెండో త్రైమాసిక చెల్లింపులు: 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.693.81 కోట్లు జమ. 

ఆగస్టు 10, 2021: వైఎస్సార్‌ నేతన్న నేస్తం  
సొంత మగ్గం కలిగి ఉండి అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు చెల్లింపు. వరుసగా మూడో ఏడాది 80,032 మంది నేతన్నల ఖాతాల్లో నేరుగా రూ.192.08 కోట్లు జమ.

సెప్టెంబర్‌ 3, 2021: ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ ప్యాకేజీ 
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు చెల్లింపు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ.684 కోట్లు విడుదల.

అక్టోబర్‌ 5, 2021: ‘స్వేచ్ఛ’తో శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ  
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా కిషోర బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో ఉచితంగా నాణ్యమైన శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఏటా 120 నాణ్యమైన శానిటరీ న్యాప్‌కిన్లు. 

అక్టోబర్‌ 7, 2021: వైఎస్సార్‌ ఆసరా 
దాదాపు 7.97 లక్షల పొదుపు సంఘాలకు చెందిన 78.76 లక్షల అక్కచెల్లెమ్మలకు పథకం ద్వారా లబ్ధి. అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు రుణాలను నాలుగు విడతల్లో చెల్లిస్తున్న ప్రభుత్వం. రెండో విడతగా రూ.6,439.52 కోట్లు చెల్లింపు.

అక్టోబర్‌ 20, 2021: జగనన్న తోడు తొలి ఏడాది వడ్డీ చెల్లింపు   
4,50,546 మంది చిరు వ్యాపారులకు రూ.16.36 కోట్ల మేర వడ్డీని చెల్లించిన ప్రభుత్వం.

అక్టోబర్‌ 26, 2021: రైతులకు ఒకేరోజు 3 పథకాలు  
వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్రసేవా పథకాలకు సంబంధించి ఒకేసారి రూ.2,190.25 కోట్లు విడుదల. రైతు భరోసా కింద వరసగా మూడో ఏడాది 50.37 లక్షల మంది రైతులకు రూ.2,052 కోట్ల లబ్ధి. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 6.67 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.112.7 కోట్ల వడ్డీ రాయితీ జమ. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్ల మేర ప్రయోజనం.

నవంబర్‌ 16, 2021: తుపాన్‌ బాధితులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ  
ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెపె్టంబరులో గులాబ్‌ తుపాన్‌కు పంటలు నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పరిహారం అందచేసింది. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ.

నవంబర్‌ 30,  2021: జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం చెల్లింపు  
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా విద్యా సంవత్సరంలో మూడో త్రైమాసికం కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు చెల్లింపు.

డిసెంబర్‌ 21, 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్‌)  
గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న 52 లక్షల మంది పేదలకు సర్వహక్కులతో ఇంటి రిజి్రస్టేషన్‌. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణాలతో పాటు మరో రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీల మినహాయింపు. మొత్తం రూ.16 వేల కోట్ల మేర నిరుపేదలకు ప్రయోజనం. పూర్తి స్వచ్ఛందంగా పథకం అమలు.

డిసెంబర్‌ 28, 2021: మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారులకూ ప్రయోజనాలు 
వివిధ పథకాల కింద మిగిలిపోయిన అర్హులైన 9,30,809 మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు జమ. 

డిసెంబర్‌ 29, 2021: కృష్ణాలో ‘పాల వెల్లువ’ 
కృష్ణా జిల్లాలోని 264 గ్రామాల్లో పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభం. పాడి రైతులకు అమూల్‌ ద్వారా ఎక్కువ ధర కల్పించడమే లక్ష్యం. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/welfare-schemes-and-programs-2021-andhra-pradesh-1424109