కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-government-orders-covid-death-compensation-1406926