కోవిడ్ సూచనలు,సేవలన్నింటికి 104 కాల్ సెంటర్

    రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 104 కాల్ సెంటర్​ లను ఏర్పాటు చేసింది. ఇందులో కరోనాకు సంబంధించిన అన్ని విషయాలపై సమాచారాన్ని అందిస్తారు. 104 కాల్ సెంటర్​కు వచ్చే ఫిర్యాదులు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకుని వారికి కావాల్సిన సలహాలు, కొవిడ్ పరీక్షలు, ఆస్పత్రుల సమాచారం అందిస్తారు. ఈ కాల్ సెంటర్ పై మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.