గుంటూరులో ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రం

    న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్కడ నిల్వ ఉంచి..రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డిమాండ్ మేరకు తరలించనున్నారు.

    న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్కడ నిల్వ చేయనున్నారు. గుంటూరు నుంచి కృష్ణా, నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు డిమాండ్ మేరకు ఆక్సిజన్ తరలించనున్నారు.

    గుజరాత్ జామ్​నగర్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్లు ఇవాళ ఆర్ధరాత్రికి గుంటూరుకు చేరుకోనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లును జేసీ దినేష్ కుమార్, రైల్వే అధికారులు పరిశీలించారు.

    Source: https://react.etvbharat.com/telugu/andhra-pradesh/state/guntur/oxygen-storage-center-in-guntur-railway-station/ap20210515162814811