గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయ శాఖలతో సీఎం జగన్‌ సమీక్ష

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాలంటీర్లకు అవార్డుల ప్రదానంపై గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. 

  సమీక్షలోని ముఖ్యంశాలు..
   సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేసి, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయాలని తెలిపారు.
  ⇔ ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన.. 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర  4వేల మంది వాలంటీర్లకు సేవా రత్న అందించాలన్నారు.
  ⇔ ప్రతి మండలానికి ఐదుగురు, ప్రతి మున్సిపాలిటీకి ఐదుగురు, ప్రతి కార్పొరేషన్‌ నుంచి 10 మంది ఎంపిక చేయాలన్నారు.
  ⇔ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సేవా వజ్రాలుగా ఎంపిక చేసి, 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం చేయాలని తెలిపారు.
  ⇔ సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేలు, సేవా వజ్రాలకు రూ.30వేల నగదు ప్రోత్సాహకం అందించాలని తెలిపారు.
  ⇔ తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్‌ ఎంచుకున్న వారికి.. నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
  ⇔ స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని.. తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్
  ⇔ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా .. నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్‌
  ⇔ కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
  ⇔ ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు.
  ⇔ ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టంగా  తెలిపారు.
  ⇔ తయారు చేసిన డిజైన్లను సీఎం పరిశీలించి సూచనలు చేశారు.
  ⇔ జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వసతుల కల్పనపై కూడా సీఎం జగన్‌ చర్చించారు.
  ⇔ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-mohan-reddy-review-meeting-building-and-sachivalaya-officials