గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అర్హులైన ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 30నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తికావాలని.. జూలై1 నాటికి వారికి కొత్త జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.