చిన్నారి ప్రాణం నిలబెట్టిన నియోనాటాల్‌ అంబులెన్స్‌

Nov 09, 2021, 12:15 IST

శిశువును కర్నూలుకు తరలించిన నియోనాటల్‌ అంబులెన్స్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అత్యాధునిక నియోనాటాల్‌ అంబులెన్స్‌తో ఓ నవజాత శిశువు ప్రాణం నిలబడింది. నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఓ పసికందును అంబులెన్స్‌ సిబ్బంది వైద్యం అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన అంజలి కాన్పు కోసం ఆదివారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఆడ శిశువుకు  జన్మనిచ్చింది.  కాగా శిశువుకు శ్యాస సంబంధిత సమస్యతో ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది.