చిరుద్యోగులకు ఆర్థిక భరోసా

  • వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా వేతనాలు, గౌరవ వేతనాలు పెంపు
  • హోం గార్డులు నుంచి ఆశాల వరకు అందరికీ ఊరట
  • తొలి కేబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకుని అమలు చేసిన సీఎం జగన్‌ 

అరకొర వేతనాలను సైతం సకాలంలో ఇవ్వకుండా చిరుద్యోగుల జీవితాలతో గత సర్కారు చెలగాటమాడింది. ప్రతిపక్ష నేతగా ఉండగా పాదయాత్ర సమయంలో వారి వెతలను స్వయంగా తెలుసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 జూన్‌ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రోజంతా వివిధ డ్యూటీలను నిర్వహించే హోంగార్డుల నుంచి బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్, సహాయకులతో పాటు పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రామ సమాఖ్య సహాయకుల వరకు  వివిధ రంగాల్లోని లక్ష మందికి పైగా చిరుద్యోగులకు వేతనాలను పెంచి ముఖ్యమంత్రి జగన్‌ ఊరట కల్పించారు.  గత సర్కారు హయాంలో వేతనాలు,  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచిన తరువాత వేతనాలు ఇలా ఉన్నాయి.  

Source : https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/financial-assurance-workers-andhra-pradesh-government-1406856