జగనన్న అమ్మఒడి

జగనన్న అమ్మ ఒడి చరిత్రలో నిలిచిపోయే పథకంగా చెప్పుకోవచ్చు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీని తన యాత్ర పూర్తవుతూ ఏడాది పూర్తి చేసుకున్న రోజే ఆ తల్లుల కోరికని నెరవేర్చారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండ ప్రతీ అక్క, చెల్లెమ్మలకు ఆ మానసిక సంఘర్షణను దూరం చేసారు. తల్లులకు, పిల్లలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడగలిగేలా.. మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదో తరగతి వరకే అని చెప్పినప్పటికి ఆ తర్వాత జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం ఇంటర్ వరకు దాన్ని విస్తరించారు. 

    జగనన్న అమ్మఒడి పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి 15 వేలు అందజేయనుంది. ఈ పధకం ద్వారా దాదాపు 43లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతోంది. పథకం కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో 6వేల 5వందల కోట్లు కేటాయించింది. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు.. జూనియర్ కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింపజేస్తారు.

అమ్మఒడి డబ్బులకు బదులుగా ల్యాప్ టాప్ లు

కోవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారన్న ఉద్దేశ్యంతో వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌ అందించనున్నారు. మార్కెట్‌లో రూ.25-27 వేల మధ్య 4జీబీ ర్యామ్‌, 500 జీబీ స్టోరేజీ, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ స్పెసిఫికేషన్‌తో దొరికే ల్యాప్‌టాప్‌ను ప్రభుత్వ చర్చలతో కొన్ని సంస్థలు కేవలం రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

అమ్మఒడి పథకం అర్హతలు:

  • ఒక కుటుంబానికి మాగాణి 3 ఎకరాలకు మించిగానీ.. 10 ఎకరాలకు మించి మెట్ట భూమిగానీ.. లేదా మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 రూపాయలకు మించి ఉండకూడదు.
  • విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు. లేదా గత ఆరు నెలలకు సగటున కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి ఉండకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల పిల్లలకు అమ్మవడి వర్తించదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లకుకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
  • కుటుంబంలో ఎవరి పేరుమీదైనా ఫోర్ వీలర్ ఉంటే అమ్మ ఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.
  • మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగులు.. గ్రామాల్లో 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటిస్థలం ఉంటే వర్తించదు.
  • గతంలో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్నవారు అనర్హులు.

పెరిగిన లబ్ధిదారులు:
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని విద్యాశాఖ తెలిపింది. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుంది.

ధరఖాస్తు చేసుకునే విధానం:

ఈ క్రింది వెబ్ సైట్ ల ఆధారంగా పధకాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్లు‌:
1.https://jaganannaammavodi.ap.gov.in/

  1. https://studentinfo.ap.gov.in/