జగనన్న గోరుముద్ద

పాఠశాల విద్యార్థుల కోసం మొదలు పెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దగా నామకరణం చేశారు. విద్యార్థులకు మనం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి చదువేనని, నాణ్యమైన విద్య అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఏ ఒక్క విద్యార్థి కళ్లలో ఆకలి కనిపించకూడదు. దృష్టి చదువు నుంచి మరలకూడదని జగనన్న గోరుముద్ద పథకాన్ని రూపొందించారు. మధ్యాహ్న భోజనానికి ఎన్నో మార్పులు చేర్చి.. వంటకాలలో పౌష్టిక విలువలను జోడిస్తూ గోరుముద్దగా నామకరణం చేసింది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం.

అంతేకాదు భోజనపథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3 వేలకు పెంచారు.

గోరుముద్ద పథకంలో భాగంగా అందించే భోజనంలో నాణ్యత పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం అందించే భోజన మెనూ ముందు తయారు చేసి దానికి అనుగుణంగా విద్యార్థులకు అందిస్తున్నారు..

భోజన మెనూ వివరాలు

సోమవారం        : అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ

మంగళవారం     : పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు

బుధవారం         : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

గురువారం        : కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు

శుక్రవారం         : అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

శనివారం          : అన్నం, సాంబార్, తీపి పొంగలి.