జగనన్న జీవక్రాంతి పథకం

మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పధకంలో రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీనికి శ్రీకారం చుట్టింది. మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు.

వ్యవసాయం వాటికి అనుబంధంగా ఉండే మేకలు, పశువులు, కోళ్ల పెంపకం చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. పంటల సాగులో నష్టాలు సంభంవించినప్పుడు రైతుల్ని ఆదుకుంటాయి. అదనపు ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉపాధి పొందేలా రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు అనుకువగా వీటి పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు జగనన్న జీవ క్రాంతి పథకం రైతులకు మరింతగా ఉపయోగపడుతుంది.

జగనన్న జీవన క్రాంతి పథకం కింద ఒక్కొక్క యూనిట్ 75 వేలుగా నిర్ణయించారు. మొదటి విడతగా మార్పి 2021 లోగా లబ్దిదారులను గుర్తించి  20 వేల యూనిట్లును పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ విడతగా 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు లక్ష 30 వేల యూనిట్లును టార్గెట్ గా పెట్టుకుంది. చివరిగా మూడవ విడత కింద  2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోగా మరో  99 వేల యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.

రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ పథకం కింద 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయస్సులోపు ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ,మహిళలకు ప్రభుత్వం గొర్రెలు, మేకలను పంపిణీ చేయనుంది. అర్హులను గుర్తించి 1868.63 కోట్ల రూపాయలతో  2 లక్షల 49 వేల గొర్రెలు మేకల యూనిట్లను ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాల వద్ద లబ్దిదారులను ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.

ఒక్కో యూనిట్ కు అంటే ఐదు నుంచి ఆరు నెలల వయస్సు గల  14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలతో పాటు ఒక పొట్టేలు లేదా మేక పోతును ఒక లబ్దిదారులకు అందిస్తారు. ఈ జీవాల పెంపకం ద్వారా నిరుపేదలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక వేల జీవాలు రోగాల బారిన పడి చనిపోతే వాటికి ఇన్సురెన్స్ సంస్థలు తగిన ఇన్సురెస్స్ అందిస్తాయి.

జీవాల పెంపకానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. జీవాల పునరుత్పత్తి ద్వారా ఎక్కువ జీవాలు వస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరుగుతాయి. జీవాల మాంసం అమ్మకాల ద్వారా అధిక ఆదాయాన్ని అర్జించవచ్చు. తద్వారా తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గొర్రెలు, మేకలు ఇవ్వడమే కాకుండా వాటి ద్వారా వచ్చిన మాంసం ఉత్పత్తులకు సైతం సరైన ధర చెల్లించేందుకు ప్రభుత్వం అల్లానా ఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

రైతులు తమ పంట పొలాల్లో రెండు మూడు రోజుల పాటు జీవాలను ఉంచుకోవడం పొలం జీవాల పేడ, మూత్రం ద్వారా ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కూడా లబ్దిదారులు లాభం పొందవచ్చు. ఈ విధంగా రైతులు సేంద్రియ పంటలు పండించుకునేందుకు  వీలు కలుగుతుంది . రైతులు సైతం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి..సేంద్రియ ఎరువుల వాడకంపై ఆసక్తి కనబరుస్తారని ప్రభుత్వం భావిస్తోంది.