జగనన్న తోడు

ఆంధ్రప్రదేశ్ లో రోజు వారి వ్యాపారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి , సూక్ష్మరుణ సంస్థల నుండి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా, యాప్ ల ద్వారా  ఎలాంటి పత్రాలు తీసుకోకుండా రుణాలు ఇచ్చందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. రుణాలు ఇస్తున్నారు కదా అని ఎక్కవవడ్డీకి రుణాలు తీసుకుని చెల్లించలేక వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మద్య కాలంలో కాలంలో ప్రైవేటు వ్యక్తులు,  సంస్థల వేధింపులకు వందలాది మంది  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ రుణ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజువారీ వ్యాపారాలను అదుకునేందుకు ముందుకు వచ్చింది. జగనన్న తోడు పేరుతో వినూత్న ప్రథకానికి శ్రీకారం చుట్టింది .  రోజంతా కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్ములో ఎక్కువ మొత్తం అప్పులకు వడ్డీ చెల్లించేందుకు సరిపోతుంది . చిరు వ్యాపారులు అప్పుల కోసం పడుతున్న అవస్థలను తన పాదయాత్రలో చూసిన జగన్ మోమన్ రెడ్డి …అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆర్థిక ఇబ్బందులకు శాశ్వాత పరిష్కారం చూపారు.  వడ్డీలేని రుణాలను చిరు వ్యాపారులకు వారి అకౌంట్లలో జమ చేశారు. రాష్ట్రంలో జగనన్న తోడు పథకం ద్వారా 9 లక్షల ఐదు వేల మంది వ్యాపారులకు  ఒక్కక్కరికి పది వేల రూపాయల రుణాన్ని అందించారు.  వీధి వ్యాపారులకు 905 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలను అందించారు.

రోడ్డు పక్కన రోజు వారి వ్యాపారాలు చేసేవారు ,తోపుడు బండ్లు ,కూరగాయల వ్యాపారులు, రోడ్ పక్కన టిఫిన్ ,టీ స్టాల్స్, చిన్న దుకాణాదారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు.వీరితో పాటు చేతి వఈత్తి కళాకారులు, తోలుబొమ్మల తయారీ దారులు, కుండల తయారీ ,బొబ్బిలివీణ, కంచు విగ్రహాలు, కళాత్మకవస్తువులు తయారు చేసే కళాకారులకు సైతం జగనన్న తోడు రుణాలకు అర్హులుగా ప్రకటించారు.

అర్హులైన లబ్దిదారులను సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకున్న నెలలోపు పరిశీలించి రుణాలు మంజూరు చేస్తారు. కొత్తగా చిరు వ్యాపారం చేయాలనుకున్న వారు సైతం ఈ రుణాలను అందించనున్నారు. అర్హులైన లబ్దిదారులకు  బ్యాంకుల ద్వారా లోన్ మంజూరు చేస్తారు. లబ్దిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించిన తర్వాత వడ్డీని ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాలో జమచేస్తుంది .

రాములు ,చిరు వ్యాపారి

మేం ప్రతి రోజు సైకిల్ పై వెళ్ళి అల్పాహారాన్ని అందిస్తాం. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద పది రూపాయల వడ్డీకి రుణం తీసుకునేవాళ్ళం. వాటిని చెల్లించేందుకు అష్టకష్టాలు పడేవాళ్ళం . ఇప్పుడు జగన్ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద పది వేల రూపాయలు రుణం మంజూరు చేసింది. దీంతో పెట్టుబడి పెట్టుకుని మా వ్యాపారాన్ని మరింత అభివఈద్ది చేసుకుంటున్నాం. జగనన్న కు ధన్యవాదారులు

పుల్లమ్మ,కూరగాయల వ్యాపారి
కూరగాయల వ్యాపారానికి మేం ఫైనాన్స్ సంస్థలనుంచి అప్పులు తెచ్చుకున్నాం.  మాకు కరోనా కారణంగా వ్యాపారాలు జరగడంలేదు .దీంతో వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
 తెచ్చిన కూరగాయలు వర్షానికి తడిసి చెడిపోతున్నాయి. జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకున్నాం . దరఖాస్తును పరిశీలించి బ్యాంకు ద్వారా ప్రభుత్వం రుణం మంజూరయింది. వడ్డీ సైతం లేకుండా పది వేల రూపాయలు మాకు ఇచ్చారు. మేం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం .  

ReplyForward