జగనన్న విద్యా దీవెన

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేలా  జగనన్న విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంటు‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. దాదాపు 14లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా డబ్బును జమ చేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా తిరిగి ఇస్తారని.. దీని కోసం కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది.

2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి తీసుకొవచ్చని తెలిపింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం.  దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుందని సిఎం జగన్ నమ్ముతారు .రాష్ట్రంలో ఏ విద్యార్థికి ఇబ్బంది ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో వరుస పథకాలు తీసుకొస్తూ చరిత్రలో నిలుస్తున్నారు. గత ప్రభుత్వాలు అందించని బకాయిలను కూడా..తను బాధ్యతలు తీసుకున్నాక పంపిణీ చేస్తున్నారు.

అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాలు కన్న తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాలకన్న తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు.


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయ పన్ను చెల్లింపుదారు / పెన్షన్ దారుడు ఉన్న యెడల అర్హులు కారు ( పారిశుధ్య కార్మికులు మినహా).


పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ బిల్డప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.


ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులను ప్రభుత్వము గుర్తింపు వున్న కళాశాలల్లో చదువుతున్న వారు
అర్హులు.

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:


2019-20 సంవత్సరంలో అనర్హత జాబితాలో వున్నవారు అభ్యంతరములు వున్నట్లైతే, ఆ వారి అర్హత ఋజువులతో గ్రామ | వార్డు సచివాలయం ద్వారా “నవశకం” లాగిన్ లో అభ్యంతరములు దాఖలు చేసిన యెడల వాటిని పరిశీలించి తగు చర్య గైకొనబడును.

2020-21 విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరచిన పిమ్మట అర్హతగల విద్యార్థులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా ” జ్ఞానభూమి ” పోర్టల్ నందు నమోదు చేసుకొనవచ్చును.

లేదా దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ / వార్డు సచివాలయం నందు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.