జర్నలిజం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం

ప్రెస్‌ అకాడమీ అధ్వర్యంలో సర్టిఫికెట్ ఇన్ జర్నలిజం కోర్సు ఆన్‌లైన్‌ తరగతులు 19-09-2021 తేదిన ప్రారంభమయ్యాయి. 300 మందికి పైగా జర్నలిస్టులు, విద్యార్థులు వర్చువల్‌ క్లాసులకు హాజరయ్యారు.

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఉపయుక్తంగా తొలిసారిగా ప్రెస్‌ అకాడమీ 8 నెలల జర్నలిజం కోర్సును ప్రారంభించిందన్నారు. జర్నలిజంలో మార్పులు, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై నిపుణులతో పాఠ్యాంశాలు రూపకల్పన చేసినట్టు వివరించారు. పరీక్షల నిర్వహణ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం చేపడుతుందన్నారు.వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.

విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్టార్‌ ఎల్‌.విజయకృష్ణరెడ్డి,పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రాఫెసర్‌ పి.విజయలక్ష్మి పాల్గొన్నారు.