జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో అవగాహన సదస్సు

జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రాధ రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడీయా జర్నలిస్టులు హాజరై ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి గారిచే తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సంధర్భంగా జర్నలిస్టులు వృత్తిలో భాగంగా మానసిక ఒత్తిడిల నుండి ఎలా అధిగమించాలన్న అంశాలపై జర్నలిస్టులకు సూచనలు అందించారు.