రైతుల్లో ఆనందాన్ని నింపుతున్న జలకళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలను నమ్ముకొని పంటలను సాగు చేస్తూ దెబ్బతిన్న రైతులు ఎందరో వుంటారు. మరీ ఆ సాగు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి గుండెలవిసేలా రోదించిన అన్నదాతలు పరిస్థితి ఏంటీ ? పోనీ ఓ సన్నకారు రైతు ధైర్యం చేసి కష్టపడి బోరు వేసుకుందాం అనుకుంటే అక్కడ నీరు పడుతుందో లేదో తెలియదు. అలాంటి రైతుల పరిస్థితులను తన పాదయాత్రల్లో ఎన్నో కష్టాలను చూసిన నేటి ముఖ్యమంత్రి జగన్.. దేశంలోనే మొదటిసారిగా ఉచితంగా బోర్లు వేయిస్తామని వైసీపీ మానసపుత్రిక అయిన నవరత్నాల్లో భాగంగా ఈ హామీని చేర్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే రైతుల కలను నిజం చేశారు. మాట తప్పరు.. మడమ తిప్పరు.. అనటమే కాకుండా జగన్ మనల్ని మరవరు అని అందరి జేజేలు అందుకుంటున్నారు.

బోర్లు వేయించుకోవాలి, పంట ఎదుగుదలను కళ్ళారా చూడాలన్న ఎంతోమంది అన్నదాతల కలను నిజం చేస్తున్న వైఎస్ఆర్ జలకళ పథకం. ఇలా నలుగురికి మంచి జరిగే పని చేస్తే ప్రకృతి కూడ చేయి చాచి సాయం అందిస్తుందంటారు. ఈ పథకం విషయంలో అదే నిజమైంది. ఈ పథకం ద్వారా వేసిన బోర్లలో చాలా వరకు విజయవంతం అయ్యాయి. రైతుల అవసరాలు తీరి జీవనోపాధి మెరుగుపరుచుకునేలా బాసటగా ఈ పథకం నిలుస్తుంది. బోర్లు వేయించడంతో పాటు అందుకు అవసరమైన పంపుసెట్లు, విద్యుత్ పరికరాలు, పైప్‌లను కూడా ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది.

మొదట వేసిన బోరు నీళ్లు పడక విఫలం అయితే ప్రభుత్వం మరో అవకాశం కూడ కల్పించటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. రైతు ఆనందం కోసం ఎంతవరకైనా వెళ్లొచ్చు.. వాళ్ల కళ్లలో సంతోషం కోసం ఏమైనా చేయొచ్చని.. గట్టిగా నమ్మి ఆచరించి చూపిస్తున్న వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ప్రతీ అన్నదాత ఆశీర్వాదంతో పాటు వారి మనసు నిండా నీరాజనాలు అందుకుంటున్నారు.

ఒకప్పుడు పంట ఎండిపోతుంటే.. ఆర్తి నిండిన కళ్లతో అలా చూస్తే మనసులో బాధపడడమే తెలుసేదని.. ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దంటూ జగన్ చేస్తున్న కృష్టికి జన్మంతా రుణపడి ఉంటామని రైతులు అంటున్నారు.

-రోశయ్య, గుంటూరు జిల్లా రైతు