జలక్రీడలకు నెలవుగా విశాఖ

    • సాగర గర్భంలో స్కూబా డైవర్ల సందడి
    • రుషికొండలో వాటర్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

    జల క్రీడలకు విశాఖ బీచ్‌లు కేరాఫ్‌ అడ్రస్‌గా మారనున్నాయి. వివిధ విభాగాల్లో శిక్షణ అందించేలా రుషికొండలో వాటర్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర, ఏపీ ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జల క్రీడలకు విశాఖ వేదికగా మారనుంది.

    అదేవిధంగా చింతపల్లి బీచ్‌లో డైవింగ్‌ అకాడమీ ఏర్పాటుకు పర్యాటక శాఖ పచ్చజెండా ఊపింది. ఏపీ స్కూబా డైవింగ్‌ అకాడమీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండూ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. వాటర్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో బోట్‌ డ్రైవర్స్‌కు శిక్షణ అందించడంతో పాటు లైఫ్‌ సేవింగ్, యాచింగ్, సెయిలింగ్, వింగ్‌ సర్ఫింగ్‌లో ట్రైనింగ్‌ అందిస్తారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/visakhapatnam-beaches-will-be-care-address-water-sports-1379917