జాతీయ స్థాయి సమీక్షలో ఏపీని ప్రశంసించిన కేంద్రం

ఇంధన సామర్థ్యంలో ఏపీ భేష్‌

ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యద్భుత పనితీరు కనబరుస్తోందని కేంద్ర విద్యుత్‌ శాఖ పేర్కొంది. ఇంధన పొదుపులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించింది.

ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియోన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలతో జాతీయస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్‌ సీఈఓ ఎ. చంద్రశేఖర రెడ్డి ఆదివారం వెల్లడించారు.
 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/central-praises-ap-government-fuel-efficiency-1406697