జైళ్ల శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు

  అనంతపురం జిల్లా జైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు, ఎలక్ట్రిషియన్ తదితర పోస్టులు ఉన్నాయి.

  ఫార్మసిస్ట్ విభాగంలో 01 ఖాళీ ఉంది. ఫార్మసీలో డిప్లొమో/బీఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఫార్మసీ కౌన్సిల్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.

  ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో 1 ఖాళీ ఉంది. టెన్త్, డీఎంఎల్టీ/బీఎస్సీ, ఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  మేల్/ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ గ్రేడ్-2: ఈ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించి ధ్రువపత్రం ఉండాలి.

  ఎలక్ట్రీషియన్: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు జరగనున్నాయి.

  దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: పర్యవేక్షణాధికారి, జిల్లా జైలు, అనంతపురం.

  Application & Notification Link: https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2021/05/2021053127.pdf