టమాటా రైతులందరికీ ప్రయోజనం చేకూర్చేలా చర్యలు

  • ఇప్పటికే 15 ఎకరాలు గుర్తించిన జిల్లా యంత్రాంగం

  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయా పారీ్టలు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇచ్చే హామీల్లో టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు తప్పక ఉంటుంది. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా.. హామీ మాత్రం బుట్ట దాఖలవుతూనే వచి్చంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కలగా ఉన్న హామీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నెరవేర్చుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాట ప్రధాన పంటగా సాగవుతోంది. ఏటా రాష్ట్రంలో  టమాట 50 వేల ఎకరాల్లో సాగవుతుంటే కర్నూలు జిల్లాలోనే దాదాపు 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అయితే ఏటా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. కిలో టమాటకు రూపాయి ధర కూడ లభించక రోడ్లపై పారబోసిన సంఘటనలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టమాటకు ధరలు పడిపోయినపుడు మార్కెటింగ్‌ శాఖ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతుల్లో కొంతవరకు భరోసా నింపింది.

  ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టింది. మరుగున పడిన టమాట జ్యూస్‌ ఇండస్ట్రి ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. 25 ఏళ్ల రైతుల కలను నెరవేర్చేందుకు ముందుకు వచి్చంది. ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో టమాట పల్ప్‌(గుజ్జు) ప్రాసెసింగ్‌ ఇండస్ట్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల  రైతులకు మేలు జరిగే విధంగా రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న మెట్టుపల్లి గ్రామం పరిధిలో టమాట పల్ప్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే 15 ఎకరాల భూములను కూడా గుర్తించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలో టమాట ఎక్కువగా సాగు చేసే ప్యాపిలి, డోన్, దేవనకొండ, పత్తికొండ, పెద్దకడుబూరు, హాలహరి్వ, హొళగొంద, ఓర్వకల్, వెల్దుర్తి, కృష్ణగిరి, కోడుమూరు, సీ.బెళగల్‌ తదితర పాంత్రాల రైతుల కష్టాలు తొలగిపోనున్నాయి.    

  డీపీఆర్‌ సిద్ధం? 
  జిల్లాలో 15 ఎకరాల్లో  ఏర్పాటు చేయనున్న టమాట గుజ్జు పరిశ్రమకు సంబంధించి డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్టును నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాప్కాన్‌ సిద్ధం చేస్తోంది. నాప్కాన్‌ నుంచి ప్రత్యేక టీమ్‌ ఇటీవల ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి వచ్చి భూములను పరిశీలించింది. డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తోంది. మరోవైపు ఎంటర్‌ప్రెన్యూర్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఎక్స్‌ప్రెసెన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ) జారీ చేసింది. టమాట గుజ్జుతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల్లో పండించే టమాటకు డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఏర్పడింది. టమాట గుజ్జు ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటును జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది.       

  గుజ్జు పరిశ్రమ జిల్లాకు వరమే  
  మెట్టుపల్లిలో టమాట పల్ప్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ 15 ఎకరాలు కేటాయించారు. కన్సల్టెన్సీగా ప్రభుత్వం నాప్కాన్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే నాప్కాన్‌ ప్రతినిధులు గ్రామానికి వచ్చి సర్వే చేశారు. డీపీఆర్‌ సిద్ధం అవుతోంది. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఇప్పటికే ఎంటర్‌ప్రెన్యూర్‌ కోసం ఈవోఐ జారీ చేసింది.  ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల టమాట రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఇక్కడ టమాట పల్ప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రభుత్వం నెలకొల్పనుంది.    
  – ఉమాదేవి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ready-set-tomato-pulp-industry-mettupall-kurnool-1383071