- 2020-21 ఏడాదికిగానూ రాష్ట్రాల వారీగా ర్యాంక్లు విడుదల చేసిన నీతిఆయోగ్
- పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీకి ర్యాంక్లు
ఐరాస-సమ్మిళిత అభివృద్ధి ఇండియా ఇండెక్స్ టాప్-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020-21 ఏడాదికిగానూ రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంక్లు విడుదల చేసింది. పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీ.. టాప్-5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 72 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా ఏపీ సాధించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో ఏపీ టాప్ ర్యాంక్ సాధించగా, ఓవరాల్గా ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది. 2018తో పోలిస్తే గణనీయంగా ఏపీ పనితీరు మెరుగుపడింది.