తిరుపతి నగరానికి 5 ప్రతిష్టాత్మక అవార్డులు

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్మార్ట్ సిటీ అవార్డుల కాంటెస్ట్‌లో తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించాయి. దేశంలో ఇండోర్‌, సూరత్‌ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్‌ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్‌ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం.. అర్బన్‌ ఎన్విరాన్మెంట్‌ విభాగంలో మూడో స్థానం దక్కింది. మొత్తంగా తిరుపతి నగరానికి ఐదు స్మార్ట్ సిటీ అవార్డులు లభించాయి.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/tirupati-claimed-five-prestigious-awards-smart-cities-awards-contest