వైఎస్సార్ రైతు భరోసా

సాగు సమయంలో రైతుల ఆర్ధిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి సాధించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13,500/- పెట్టుబడి సహాయంగా ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.67,500/- అందించనుంది.

ఇందుకు కావాల్సిన అర్హతలు:


-వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు.

-ఆర్.ఓ.ఎఫ్.ఆర్ మరియు డి- పట్టా భూములను (సంబంధిత రికార్డులలో నమోదైన వాటిని) సాగుచేయుచున్న రైతు కుటుంబాలు అర్హులు.


-పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు.

-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన సొంత భూమి లేని సాగుదారులలో వ్యవసాయ, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరంలో , పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 0.5 ఎకరం లేదా కనీసం 0.1 ఎకరం తమలపాకు సాగు చేయుచున్నచో అట్టి సాగుదారులు అర్హులు.


-ఒక భూ యజమానికి ఒకరి కన్నా ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటే, అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)కి చెందిన కౌలు రైతుకు ఇవ్వబడుతుంది. ఆ తరువాత ప్రాధాన్యతా క్రమంలో చూస్తే షెడ్యూల్డ్ కులం(ఎస్సీ), వెనకబడిన(బిసీ) మరియు మైనారిటీ తరగతికి చెందినవారికి కేటాయించబడుతుంది.


-గిరిజన ప్రాంతాలలో , గిరిజన చట్టాల ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించటం జరుగుతుంది.


-ఒకే ఊరిలో ఉన్న సన్న కారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గల కౌలు ఒప్పందం చెల్లదు.


-దేవాదాయ శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్ధిని పొందడానికి అర్హులు.

-రైతు కుటుంబంలో పెళ్ళికాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నప్పటికి సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపొతే అతను వైయస్ఆర్ రైతు భరోసాకి అర్హుడు.


జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా అర్హులైన భూమి గల రైతులను గుర్తించటం జరుగుతుంది.
భూమి లేని సాగుదారులను పంటసాగుదారుల హక్కు పత్రం ఆధారంగా గుర్తించటం జరుగుతుంది.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు స్వయంగా రైతు భరోసా కేంద్రాలలో కానీ గ్రామ / వార్డు సచివాలయంలో సంప్రదించాల్సి వుంటుంది.

రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్రింది లైన్ లో కనిపిస్తున్న వైయస్ఆర్ రైతు భరోసా వెబ్ సైట్ లింక్ ని క్లిక్ చేసి రైతులు తమ వివరాలను తెలుసుకోవచ్చు.

https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html లోకి వెళ్ళి రైతు తన ఆధార్ కార్డు నెంబర్ ‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమ అయ్యాయో లేదో తెలిసిపోతుంది.

ఇందులో మీకు ఏదైన సమస్య వస్తే ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ కి డయల్ చేయండి.