తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

16-12-2020 తేదిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా తరగతుల్లో భాగంగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు.

ముఖ్య అతిధులుగా కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి‌, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఐఏఎస్ లతో పాటు విశిష్ట అతిధిగా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ లు పాల్గొన్నారు.

సమన్వయకర్తగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్‌.విజయకృష్ణారెడ్డితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ తో పాటు జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంపొందించేలా అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందించారు.

శిక్షణ తరగతుల అంశాలు:

1.వార్తా సేకరణలో మెళకువలు – వార్తల్ని పసిగట్టడం ఎలా : కె.వి రామిరెడ్డి

2.వార్తా రచన – తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు : ఆర్.దిలీప్ రెడ్డి