తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన కొమ్మినేని

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరబాద్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అకాడమీల్లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు మరియు పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.