తోటపల్లి ప్రాజెక్ట్

విజయనగరం జిల్లా తోటపల్లి గ్రామంలో నాగావళి నదిపై 2.509 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ రిజయర్వాయర్ ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో లక్షా 35 వేల ఎకరాల నూతన ఆయకట్టుకు నీరు అందిచడంతో పాటు 64 వేల ఎకరాలను స్థిరీకరించడానికి నిర్దేశించిన పథకం.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో సాగునీరు మరియు సమీప గ్రామాలకు త్రాగునీటిని అందిస్తున్నారు. పరిశ్రమలకు కావాల్సిన నీటి అవసరాలను తీర్చటానికి నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టటం జరిగింది. ప్రస్తుతం తోటపల్లి రెగ్యులేటర్ 500 మీటర్ల ఎగువన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం, తోటపల్లి గ్రామ సమీపంలో 16 టి.ఎం.సి.ల నీటి వినియోగంతో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించబడింది. 117.89 కి.మీ. కుడి ప్రధాన కాలువ, 359 మీటర్ల కుడివైపు లింకు కాలువ,513 మీటర్ల ఎడమ లింకు కాలువలు ఈ పథకంలో భాగంగా వున్నాయి. ఈ పథకం ద్వారా విజయనగరం జిల్లాలో 62,000 ఎకరాలు. శ్రీకాకుళం జిల్లాలో 58,000 ఎకరాల భూమికి కొత్తగా సాగునీటి వసతి కల్పించబడుతుంది. కుడి ప్రధాన కాలువ క్రింద 24 గ్రామాల్లో సుమారు 42 చెరువులకు త్రాగునీటి సరఫరా జరుగుతుంది.

ప్రాజెక్టు ముఖ్యవివరాలు:

పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టం : +105.00 మీ.
స్థూలంగా నీటి నిల్వ : 3.003 టి.ఎం.సి.
లైవ్ స్టోరేజ్ : 2.509 టి.ఎం.సి.
స్పిల్‌వే పొడవు : 115 మీ.
స్పిల్‌వే క్రెస్టు గేట్లు : 8 గేట్లు (12X7మీ.)
ఎర్త్ బండ్ పొడవు : 8.20 కి.మీ.