‘నాడు – నేడు’తో మారిపోయిన బడుల రూపురేఖలు

2019-20 విద్యా సంవత్సరానికి కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి సంకల్పిస్తూ.. నాడు – నేడు కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. తొలిదశగా 2019 నవంబర్‌ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 15,715 పాఠశాలలను ఆధునీకరిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు దశలవారీగా పనులను 2021 ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ముందుగా రాష్ట్రంలోని పాఠశాలలో నిలిచిన పనులు మొదట పూర్తి చేశారు. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం కొత్త రూపురేఖల్ని సంతరించుకున్నాయి. ప్రయివేటు పాఠశాల దోపిడిని అరికడుతూ.. అదే స్థాయిలో పేదవిద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని స్కూళ్లు.. నేడు అడుగడుగునా పురోగతి సాధించాయి. తరగతి గదుల్లో అత్యాధునికమైన ఫర్నీచర్, టాయిలెట్లు కార్పోరేట్ హంగులతో ఏర్పాటు చేశారు. పాఠశాలల్లోని ఆవరణంలో ఆహ్లాదకరంగా ఉండేటట్టు పచ్చదనాన్ని పెంపొందించారు. విశాలమైన తరగతి గదులు. ఆ గదుల్లో అందమైన గ్రానైట్ ఫ్లోరింగ్ ,సీలింగ్, మోడరన్ టాయిలెట్స్ విద్యార్ధులు కూర్చోడానికి టేబుల్స్, ఆడుకోవడానికి విశాలమైన ప్లే గ్రౌండ్ లను సిద్దం చేశారు. రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ప్రాజెక్టుల చిత్రాలను గోడలపై పేర్లతో సహా చిత్రీకరించారు. అలాగే పక్షుల బొమ్మలు, చిన్నారుల కోసం సూక్తులు గోడలపై రాసారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన పరిసరాలతో స్కూల్ ను సుందరంగా తీర్చి దిద్దుతూ ప్రభుత్వ పాఠశాలను ఓ రోల్ మోడల్ గా మార్చారు.  

తన చిన్న తనంలో తాను ఈ పాఠశాలలోనే చదువుకున్నానని.. అప్పట్లో నీరు , కరెంట్ సౌకర్యం లేక చెట్ల కిందే తమకు బోధనా తరగతులు జరిగేవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదే పాఠశాలలో మా పిల్లలు చదువుతున్నారని…అప్పటికీ ఇప్పటికి ఎన్నో మార్పులు చేసారని.. అందులో డిజిటల్ విధానంలో విద్యా బోధన తీసుకురావడం వల్ల మా పిల్లలకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతున్నాయని రజిని తెలిపింది. ప్రైవేటు విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో చక్కగా తీర్చిదిద్దారని అందుకే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నట్లు రజిని ఆనందంగా చెబుతుంది.

-రజిని , విద్యార్థి తల్లి


తమ పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా… పేదలు తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసి మరీ ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకొస్తూ వారి పిల్లల్ని ప్రభుత్వం పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవటం మంచిదని రఘురామయ్య కోరుతున్నారు.

రఘురామయ్య , విశ్రాంత ఉద్యోగి