సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
05-10-2020 తేదిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టులకు నిర్వహించిన వర్చువల్ ఆన్ లైన్ శిక్షణా తరగతుల్లో భాగంగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు.
ముఖ్య అతిధులుగా నీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబు ఐఏఎస్ లతో పాటు విశిష్ట అతిధిగా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ లు పాల్గొన్నారు.
సమన్వయకర్తగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ తో పాటు జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంపొందించేలా అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందించారు.
శిక్షణ తరగతుల అంశాలు:
1.వివిధ రకాల వార్తలు రాసే పధ్ధతులు (వ్యవసాయ, విద్య, రాజకీయ, అభివృద్ధి, ప్రమాద, కైం) :శశాంక్ మోహన్, సీనియర్ జర్నలిస్ట్
2.క్షేత్ర సందర్శనే విలేకరి బలం – వాట్సాప్ జర్నలిజం నష్టం : కె. స్రవంతీ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్