పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు

కేంద్ర పట్ణణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘అర్బన్‌ హౌసింగ్‌ కాన్‌క్లేవ్‌’లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌గా సామర్లకోటకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్‌ లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి హరదీప్‌సింగ్‌ పురీ చేతుల మీదుగా ఏపీ టిడ్కో చైర్మన్‌ జె.ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్‌ గురువారం అందుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాన్‌క్లేవ్‌లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్లు, వైఎస్సార్, జగనన్న కాలనీల స్టాల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/award-samarlakota-construction-houses-urban-poor-1495540