కర్నూలు జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

    సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

    09-01- 2021 తేదిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా తరగతుల్లో భాగంగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు.

    విశిష్ట అతిధిగా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.

    సమన్వయకర్తలుగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్‌.విజయకృష్ణారెడ్డి, అకాడమీ ఛైర్మన్ సలహాదారు పి.ఎన్ ప్రసన్న కుమార్ తో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ తో పాటు జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంపొందించేలా అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందించారు.

    శిక్షణ తరగతుల అంశాలు:

    సైన్స్ జర్నలిజంలో గ్రామీణ జర్నలిస్టుల పాత్ర : పి.విజయ లక్ష్మీ, జర్నలిజం శాఖ ప్రొఫెసర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

    పాత్రికేయులు – సామాజిక భాద్యత : బాబీవర్ధన్, జర్నలిజం శాఖ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం