పాడి పంటతో ప్రతి ఇంట ఆనందాల సిరులే…

పాడి ఉన్న ఇంట సిరులు దొర్లుతాయని ఆనాడు పాదయాత్రలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేవలం వ్యవసాయంతోనే బతకడం కష్టం. ఆదాయం పెరగాలంటే పాడి సహకారం అవసరమన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఆసరా, చేయూత పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తున్నారు. వారికి ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయ్యేలా, జీవిత కాలం.. మరో శతాబ్దం పాటు వారికి మేలు కలిగేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  వైఎస్సార్‌ చేయూత, ఆసరా అక్కచెల్లెమ్మలకు పాడి పశువుల ద్వారా ప్రతి రోజూ మెరుగైన సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఏపీ–అమూల్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

పాదయాత్రలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ను రైతులు తీసుకువచ్చారు. ఒక లీటరు వాటర్‌ ధర 21 రూపాయలు ఉంది. ఈ రోజు పాల ధర కూడా అంతే ఉందని చెప్పి జగన్ ముందు కొందరు బాధపడ్డారు. అప్పుడే పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించుకున్నారు జగన్. సహకార రంగాన్ని బలపరచాలి. మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. మన ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్‌ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది. అమూల్‌ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్‌ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు.

రాష్ట్రవ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్‌ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి. పాల సేకరణ తర్వాత 10 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. కమీషన్లు ఇచ్చుకోవడం ఉండదు.  మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్‌ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో కూడ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.దీనితో తమకు క్రమం తప్పకుండా డబ్బులు జమ అవ్వటంపై లభ్ధిదారుల్లో సంతోషం నెలకొంది.

-కమల, పశ్చిమ గోదావరి జిల్లా మహిళ

పాడి పరిశ్రమ అభివధ్దితో పాటు మహిళల జీవానోపాధి మెరుగుపడుతూ పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల తమకు పాల ద్వారా మంచి ఆదాయం వస్తుందని.. ధీమాగా తమ కుటుంబాాలలో జీవనం కొనసాగిస్తున్నామని మహిళలు అంటున్నారు.

– కృపారాణి,గుంటూరు జిల్లా మహిళ రైతు