- ప్రధాని మోదీతో వర్చువల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్
- రాష్ట్రంలో భారీగా గృహ నిర్మాణాలతో ఆర్థిక రంగానికి ఊతం
- 30 రకాల వృత్తిదారులకు పెద్ద ఎత్తున ఉపాధి
- అందరికీ ఇళ్లు లక్ష్యంలో ముందు వరుసలో ఏపీ
- పీఎంఏవై అర్బన్ గృహ నిర్మాణాల్లో రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులు
రాష్ట్రంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను షెడ్యూల్ ప్రకారం 2022 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం (గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్) కింద ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, పీఎంఏవై (అర్బన్), ఆశా–ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రధాని మోదీతో సహా అందరికీ ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.