పేదల ఇళ్ల నిర్మాణ వేగం కోసం ప్రత్యేక అధికారుల నియామకం

    వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించింది. వీరు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఫేజ్‌ల్లో రూ. 50,944 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ జేసీలకు హౌసింగ్, ఎనర్జీ, రూరల్‌ వాటర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఏపీ ఫైబర్‌ నెట్, గ్రామ, వార్డు శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. మొదటి దశ జూన్‌ 2022, రెండో దశ జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.