పేద విద్యార్థుల తల్లితండ్రుల్లో ఆనందం

ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. అందరితో చదువుల్లో పోటి పడుతూ భవిష్యత్తులో తాను మంచి స్థానంలో వుండాలంటే ప్రతి విద్యార్ఖికి ఇప్పుడు ఇంగ్లీష్ తప్పని సరిగా మారింది. రాష్ట్రం నుండి దేశం, దేశం నుండి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా బతకాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌ రావాల్సిందే. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, ప్రపంచీకరణ యుగంలో అన్నింట్లో ఇంగ్లిష్‌ అవసరం పెరిగింది. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేశాయి. ఈ నేపథ్యంలో  విద్యారంగంలో సమూల మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యారంగంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. 2020 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి , 2022- 23 లోగా పదో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రజలు ,విపక్షాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో విప్లవాత్మక మార్పులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఇంగ్లీష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తోంది. ఇక  విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైతం ఇంగ్లీష్ మీడియం పట్ల సుముఖుత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ప్రభుత్వ ,మున్సిపల్ ,జిల్లా పరిషత్, మండల పరిషత్ ల ఆధ్వర్యంలో 62 వేల 182 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సుమారు 65శాతం పైగా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంను ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీఢియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ప్రపంచంలో ఎక్కడైన బతుకెందుకు ఇంగ్లీష్ అవసరం . అది ఒక సబ్జెక్ట్ గా చదివితే రాదు.మాతృభాష రావడానికి అన్ని సబ్జెక్ట్ లు తెలుగులో చదవాల్సిన అవరం లేదు. పసిపిల్లల వయస్సులోనే ఇంగ్లీష్ నేర్పించడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం వల్ల మాతృభాషలు అంతరించిపోతాయనడం సరైంది కాదు.  

అంజనేయులు , ఉపాధ్యాయుడు  


 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పెడితే మాతృభాష రాకుండా పోతుందా ?  కోట్లాది మంది తెలుగు వారు నిత్య వ్యవహారాల్లో మాతృభాష మాట్లా డుతుంటే తెలుగెలా పోతుంది ?  కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం ఉన్న మాతృభాషలు శాశ్వతంగా బతుకుతాయి. తెలుగు సమాజంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా సరే ఆ రాష్ట్ర భాషను నేర్చుకోవాలన్న విషయాన్ని కచ్చితంగా అమలు చేయాలి .

సత్య నారాయణ, రిటైర్డ్ ఉద్యోగి


మా బాబు, పాపను ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం. ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడతారు. స్కూల్ లో ఇంగ్లీష్ లో పాఠ్యాంశాలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. మేం కూడా గంట సేపు అందరం ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నాం. అలా మా పిల్లలకు ఇంగ్లీష్ అంటే భయం లేదు. భవిష్యత్ లో ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారి భవిష్యత్ బాగుంటుందనే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించాం .

ఇస్మాయిల్ , ప్రైవేటు ఉద్యోగి

మాకు ఇద్దరు కుమారులు రమేష్ నాలుగో తరగతి , శిరీష్  ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరిని గతంలో ఫీజులు చెల్లించి  ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం. అయినా ఇంగ్లీష్ సరిగా మాట్లాడే వారు కాదు . ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం. దీంతో మాకు కొంత ఆర్థిక భారం తగ్గింది. ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోటయ్య, వ్యవసాయ దారుడు

మేం నిరక్ష్యరాసులం కనీసం మా పిల్లలనైనా మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థానానికి చేర్చాలనుకున్నాం. మా కలలను సకారం చేసేందుకు జగనన్న ప్రభుత్వం సహకరించింది. మా ఇద్దరి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం . ఒక పూట జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పోషకాహారం ఇస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింది చెరో 15 వేల రూపాయల అకౌంట్లో వేస్తున్నారు.ఇంగ్లీష్ మీడియంలో చదువును కొనసాగిస్తున్నారు.

రాములు , రైతు