రాష్ట్రాన్ని సశ్యశ్యామలంగా తీర్చే పోలవరం ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు  చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం జలాశయం. గోదావరి ,కష్ణా నదులను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న బహుళార్థ సాధన నీటి పారుదల పథకం 2021 కి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్య పేట గ్రామం వద్ద గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు .  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణచట్టం 2014 సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్ట్ హోదో కల్పనతో పాటు  పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది .

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాలకు , విశాఖపట్నం, కఈష్ణ జిల్లాలలో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ  పోలవరం జలాశం ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా ,చత్తీస్ గడ్  వరకు విస్తరించింది.

 -పోలవరం ప్రాజెక్ట్ ను    2004 లో ప్రారంభించారు .ఈ ప్రాజెక్ట్ ను  కేంద్ర ప్రభుత్వం  2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. 2015 మే వరకు 6225.03 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్ట్ 32 శాతం పనులుపూర్తయ్యాయి.2020 నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి.   2021 కి పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

-130 మీటర్ల ఎత్తు, 9 వేల 560 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రూపొందిస్తోంది. తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.

-ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు తీరుస్తుంది. విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు . విద్యుదుత్పత్తి, జలరవాణా, చేపల పెంపకం కు ఉపయోగపడుతుంది.

-ఈ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ద్వారా 7.20 లక్షల ఎకరాల భూములకు సాగునీటి సౌకర్యం అందుతుంది.  ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏపీ జెన్ కో ఏర్పాట్లు చేస్తోంది.  ప్రకాశం బ్యారేజీకి ఎగువన 80 టీఎంసీల నీటిని కఈష్ణ నదికి మళ్ళించేలా ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కాలువల వెంట ఉన్న 540 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.

 -పోలవరం పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది. 1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ఈ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు.

ఎత్తిపోతల పథకాలు
పోలవరం భారీ ప్రాజెక్ట్ తో  పాటు పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది.ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం ప్రాజెక్ట్ లో భాగం కాదని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని  రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మించాలని కేంద్రం వెల్లడించింది.


పట్టిసీమ: పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది.

పురుషోత్తమపట్నం: రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.

-పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తి చేసుకోబోతుండడం విశేషంగా మారింది. ప్రస్తుతం పనులు కీలక దశకు చేరుకున్నాయి.

-కరోనా లాక్ డౌన్ లోనూ పనులు ఆపకుండా ఏపీ సర్కార్ పనులు కొనసాగించింది. మొన్నటి వర్షాలకు వరదలు వచ్చినా ముందస్తుగానే గడ్డర్లు ఏర్పాటు చేసుకొని పనులు ఆగకుండా చేశారు.

-ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన తర్వాత  జాతీయ ప్రాజెక్ట్  నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన  హైడ్రాలిక్ క్రస్ట్ గేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. మొత్తం గేట్లకు వినియోగించే స్టీలు 18వేల టన్నులు.. పోలవరం ఆరమ్స్ ప్రపంచంలోనే పెద్దవి. గేట్లు పైకి, కిందకి కదలడానికి, వరద నీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతిలో  గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.  

-పోలవరంలో వేగంగా పనులు కొనసాగుతూనే, స్పిల్ వే బ్రిడ్జిగేట్ల ఏర్పాటు ఎగువ కాపర్ డ్యాం పనులు మరియు ఫిష్ లాడర్ పనులను చివరి దశకు చేరుకున్నాయి.  షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డిసెంబర్ 2021 వరకు పూర్తి చేయాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

-దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తి చేసుకోబోతుండడం విశేషంగా మారింది.