ప్రగతి బాటలో ‘పల్లె’విస్తున్నాయ్‌

  • గ్రామాల ముంగిట్లోనే అందుతున్న పాలన
  • రూ.1,739.64 కోట్లతో అభివృద్ధి పనులు
  • సకాలంలో దరిచేరుతున్న సంక్షేమం
  • హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు  

ఏడాదిన్నర వైఎస్సార్‌ సీపీ పాలన పల్లెల ప్రగతికి బాటలు వేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రీతిలో బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన పల్లెల ముంగిటకే పాలన చేరడంతో గ్రామస్తుల గుండెల నిండా సంతోషం కనిపిస్తోంది. ఒకప్పుడు ఏదైనా చిన్న సమస్య పరిష్కారం కావాలంటే కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంతో కూడా తెలియని దుస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా సమస్యపై దరఖాస్తు ఇస్తే నిర్దేశించిన గడువులోపే.. అది కూడా పల్లె పొలిమేర దాటకుండానే పరిష్కారం లభిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను నూరు శాతం పూర్తి చేస్తుండటంతో పల్లె ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.